Home > సినిమా > జిమ్ లో కసరత్తులు చేస్తున్న మెగాస్టార్...ఆ సినిమా కోసమే!

జిమ్ లో కసరత్తులు చేస్తున్న మెగాస్టార్...ఆ సినిమా కోసమే!

జిమ్ లో కసరత్తులు చేస్తున్న మెగాస్టార్...ఆ సినిమా కోసమే!
X

స్టార్ స్టార్ మెగాస్టార్..పాత తరం నుంచి నేటి కొత్త తరం వరకు మూడు దశాబ్దాలకుపైగా సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు మన చిరంజీవి. ఆయన టచ్ చేయని జోనర్ లేదు. యాక్షన్, సెంటిమెంట్, రోమాన్స్, డ్యాన్స్ ఇలా అన్నింట్లోనూ దుమ్ము లేపుతున్నారు. అదిరిపోయే డ్యాన్స్ లతో నేటి తరం యువహీరోలను సైతం వెనక్కి నెట్టి బాసు తన గ్రేసును చూపిస్తున్నారు. అయితే మన చిరు సినిమా కోసం ఎంత దూరమైన వెళ్తారు. సినిమా ఏదైనా దాన్ని నమ్మితే వంద శాతం దాని న్యాయం చేసేలా చూసుకుంటారు. దర్శకులకు, నిర్మాతలకు మంచిగా ఉండే ఈ హీరో..తాజాగా తన నెక్స్ట్ మూవీ కోసం జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. దానికోసం రెడీ అవుతున్నా అంటూ ఫ్యాన్స్ కోసం ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మెగాస్టార్ స్కీన్ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కు పండగే. విజిల్స్ , పేపర్లతో థియేటరంతా మోత మోగిపోతుంది. బాసూ అడుగు పెడితే ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కావల్సిందే. గత ఏడాది చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్టు అయ్యింది. తర్వాత వచ్చిన భోళా శంకర్ థియేటర్ లో ఢీలా పడి మెగా అభిమానులకు నిరాశను మిగిల్చింది. ఈ సినిమా ఎఫెక్ట్ తో చిరు ఆచితూచి కథలను ఎంచుకున్నాడు.

ప్రస్తుతం ఫాంటసీ సినిమాలకు క్రేజ్ పెరుగుతోంది. దీంతో ఓ సోషియో ఫాంటసీ సినిమాను చేయాలని డిసైడ్ అయ్యారు మన మెగాస్టార్. తన 156వ సినిమాగా 'విశ్వంభర'తో చిరంజీవి బిజీగా ఉన్నారు.

బింబిసార ఫేమ్ డైరక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చేస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. బియాండ్ యూనివర్స్ అంటూ చిరు కొత్త కథతో రాబోతున్నారు. ఇప్పటికే..రిలీజ్ చేసిన విశ్వంభర గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. 68 ఏళ్ల వయస్సులో కూడా జిమ్ లో కసరత్తులు చేస్తూ నెటిజన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నారు చిరంజీవి. కుర్రకారుకు ఏ మాత్రం తీసిపోకుండా జిమ్ లో దుమ్ములేపుతున్నారు మన బాస్. ఈ వీడియో చూసిన వారంతా ఛ..ఛ..ఆయనికింకా వయస్సవలా.. అంటున్నారు. ప్రస్తుతం బాసూ షేర్ చేసిన ఈ వీడియో నెటింట చక్కర్లు కొడుతుంది.

Updated : 1 Feb 2024 3:57 PM IST
Tags:    
Next Story
Share it
Top