Home > సినిమా > న్యూయార్క్‌లో మెగాస్టార్‌కు అభిమాని ప్రత్యేక విషెస్

న్యూయార్క్‌లో మెగాస్టార్‌కు అభిమాని ప్రత్యేక విషెస్

న్యూయార్క్‌లో మెగాస్టార్‌కు అభిమాని ప్రత్యేక విషెస్
X

మెగాస్టార్ చిరంజీవిపై అభిమానాన్ని ఓ ఫ్యాన్ చాటుకున్నారు. ఇటీవల భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడంతో అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరు ఫోటోను ప్రదర్శించి అభినందలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది గర్వపడే క్షణమని, భారత సినిమా గేమ్ ఛేంజర్ మెగాస్టార్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 'దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ను సాధించిన సందర్భంగా అభినందనలు మెగాస్టార్ చిరంజీవి' అంటూ విజువల్స్ పై పేర్కొన్నారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు సినీ పరిశ్రమను తన అద్భుత నటన, డ్యాన్సులు, స్పీడ్ తో మరో దశకు తీసుకెళ్లిన నట శిఖరం చిరంజీవి. టాలీవుడ్ చరిత్రను చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత అని రెండు భాగాలుగా చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినీ రంగానికి ఆయన చేసిన విశేషమైన సేవలకు గాను భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ కు ఎంపిక చేసింది.

Updated : 30 Jan 2024 4:35 PM IST
Tags:    
Next Story
Share it
Top