Home > సినిమా > జీవితం ఎటు తీసుకువెళితే అటు వెళ్ళండి-Niharika Konidela

జీవితం ఎటు తీసుకువెళితే అటు వెళ్ళండి-Niharika Konidela

జీవితం ఎటు తీసుకువెళితే అటు వెళ్ళండి-Niharika Konidela
X

జీవితంలో కొన్ని వలయాలు ఉంటాయి. ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అలా జరగకూడదని...అక్కడే ఆగిపోవాలని కోరుకుంటే దాని సహజగుణానికి అడ్డుపడుతున్నట్లే అవుతుంది. అది అనవసరమైన ఒత్తిడికి దారి తీస్తుంది. కాబట్టి జీవితం ఎటు తీసుకువెళితే అటు వెళ్ళండి. ప్రయాణం ముగింపు తెలుసుకున్నాక నువ్వే సర్ ప్రైజ్ అవుతావు అంటే పోస్ట్ పెట్టింది మెగా డాటార్ నీహారిక. ఈ అమ్మాయి జీవితంలో మలుపులు చాలానే ఉన్నాయి. పుట్టి, పెరిగిందీ మెగా ఫ్యామిలీ ఇంట్లోనే అయినా ఆటుపోట్లు తప్పలేదు. అందుకేనేమో ఇలాంటి పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ముందు యాంకరింగ్ అని వచ్చి తరువాత యాక్టింగ్ లోకి అడుగుపెట్టి....సినిమా నిర్మాణ సంస్థను సైతం ఒంటి చేత్తో నడిపిస్తోంది నీహారిక కొణిదెల. నాగబాబు కూతురుగా స్పెషల్ స్టేటస్ ఉన్నప్పటికీ తనదైన స్టైల్ను చూపించడానికి మొదటి నుంచీ తాపత్రయపడింది. యాంకింగ్ లో మంచి పేరు తెచ్చుకుంది. తరువాత షార్ట్ ఫిల్మ్స్, సినిమాల్లో నటించింది. ఈమె చేసిన సినిమాలు పెద్ద హిట్ లు అవలేదు కానీ మంచి పేరును అయితే తెచ్చుకున్నాయి. పెళ్ళికి ముందు నుంచి అయిన తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంది. ఈ మధ్యనే వచ్చిన డెడ్ పికెల్స్ వెబ్ సీరీస్ తో మళ్ళీ యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టింది.

చైతన్య జొన్నలగడ్డ(chaitanya jonnalagadda )ను ప్రేమించి, పెళ్ళి చేసుకుంది నీహారిక. అయితే ఏమైందో తెలియదు రెండేళ్ళు తిరక్కుండానే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. గత నెల జూలై 4న వీరి విడాకులు కన్ఫార్మ్ అయ్యాయి. ఈ విషయాన్ని వాళ్ళే స్వయంగా చెప్పారు కూడా. అప్పటి నుంచీ ఈ మెగా డాటర్ టార్గెట్ అయిపోయింది. పబ్ లో పట్టుబడడం, విడాకులు వీటన్నింటి వెనుకా నిహారికా తప్పే ఉందని అందరూ విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా ఆమెను విమర్శిస్తూ కామెంట్లు పెడుతూనే ఉన్నారు. అయితే ఇవేవీ పట్టించుకోని నాగబాబు కూతురు తన స్టైల్లో ఫోటోలు పెడుతూ చివరలో పెద్ద సందేశాన్ని కూడా షేర్ చేసింది.


Updated : 4 Aug 2023 4:57 PM IST
Tags:    
Next Story
Share it
Top