Home > సినిమా > Bigg Boss 7 :100 మందిలో ఒక్కడు...బిగ్ బాస్ హౌస్‎లో వినిపించే వాయిస్ ఇతనిదే

Bigg Boss 7 :100 మందిలో ఒక్కడు...బిగ్ బాస్ హౌస్‎లో వినిపించే వాయిస్ ఇతనిదే

Bigg Boss 7 :100 మందిలో ఒక్కడు...బిగ్ బాస్ హౌస్‎లో వినిపించే వాయిస్ ఇతనిదే
X

2017లో ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ షో అతిపెద్ద రియాలిటీ షోగా అవతరించింది. వెండితెర తారల నుంచి సోషల్ మీడియా స్టార్స్ వరకు ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి ప్రేక్షకులను నాన్ స్టాప్ వినోదాన్ని అందించారు... అందిస్తున్నారు..ఇప్పటి వరకు 6 సీజన్‎లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 7 సీజన్‎తో బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ ఇంతటి హిట్ అవ్వడానికి తెరముందు కనిపించే తారలు ఒక కారణం అయితే, తెరవెనుక తన వాయిస్‎తో ఆకట్టుకునే బిగ్ బాస్ వాయిస్ కూడా ఓ కారణమనే చెప్పాలి. మరి బిగ్ బాస్ షోలో అందరినీ ఆకట్టుకుంటున్నఆ వాయిస్ ఎవరిది? ఆ వాయిస్‎కు ఉన్న క్రేజ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బిగ్ బాస్ వాయిస్. ఈ గొంతుకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ ఏడవ సీజన్ నడుస్తున్నా..కంటెస్టెంట్స్ మారుతున్నారే కానీ ఈ వాయిస్ మాత్రం మారడం లేదు. నిజానికి ప్రేక్షకులు ఈ వాయిస్‎కు బాగా కనెక్ట్ అయ్యారనే చెప్పాలి. గాంభీర్యంగా ఉండే బిగ్ బాస్ వాయిస్ విని కంటెస్టెంట్స్ కూడా అలర్ట్ అవుతారు. ఆ గొంతు ఏం చెబితే అది తూచాతప్పకుండా పాటిస్తారు. మరి తెర వెనుక ఉన్న ఇంతటి మెస్మరైజింగ్ వాయిస్ ఎవరిదో కాదు సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్‎గా పేరు సంపాదించుకున్న రాధాకృష్ణ ది. ఈయన అసలు పేరు రేనుకుంట్ల శంకర్.

రేనుకుంట్ల శంకర్ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. బిగ్ బాస్‎కి ముందు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక చిత్రాలకు డబ్బింగ్ చెప్పేవారు. సినిమాలతో పాటు సీరియల్స్, అడ్వర్టైజ్‌మెంట్స్ కు తన వాయిస్ అందించారు. అయితే సీనియర్ ఆర్టిస్ట్ కదా అందుకే బిగ్ బాస్ ఛాన్స్ విచ్చిందనుకుంటే పొరపాటే. అంత సులువుగా ఈయన్ని ఎంపిక చేయలేదు. తెలుగులో బిగ్ బాస్ షోని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు 100 మంది నుంచి ఆడిషన్స్ తీసుకున్నారట మేకర్స్. వారందరి గొంతులను పరిశీలించిన తరువాత చివరకు శంకర్ వాయిస్ ఫైనల్ అయ్యారట. మరీ ముఖ్యంగా శంకర్ వాయిస్‎లోని గాంభీర్యం నచ్చి ఆయనకు ఈ ఛాన్స్ ఇచ్చారని సమాచారం. శంకర్ మొదటి మూడు , నాలుగు సీజన్లలో ఒకలా వాయిస్ ఇచ్చారు. ఆ తర్వాత తన వాయిస్‎ను మార్చారు. ఆ వాయిస్‎నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ 7 సీజన్‍కు కూడా తన వాయిస్ అందిస్తున్నారు శంకర్..





Updated : 13 Sept 2023 11:51 AM IST
Tags:    
Next Story
Share it
Top