మియా ఖలీఫా వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బిగ్ బాస్ ప్రేక్షకులకు పండగే..!
X
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కో షోకు ఒక్కో ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులో బిగ్ బాస్ కు మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా.. ప్రేక్షకులకు బిగ్ బాస్ ఇచ్చే కిక్కే వేరు. ఆడియన్స్ ఎక్కువగా చూసే షోలు కూడా ఇవే. వాళ్ల ఫేవరెట్ కంటెస్టెంట్ ను గెలిపించడం కోసం ఆర్మీలు క్రియేట్ చేసి మరీ ఓటింగ్ చేస్తరు. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ వస్తోంది. హిందీలో రెండో సీజన్ ను ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. ఈ సీజన్ కు సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేయనున్నాడు. ఈ క్రమంలో ఇందులో ఎవరు పాల్గొంటారనే ఆసక్తి నెలకొంది.
సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్, హిందుస్థాన్ టైమ్స్ లో ఇచ్చిన నివేదిక ప్రకారం.. బిగ్ బాస్ కు మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ బృందం.. మియా ఖలీఫాతో పాటు రాజ్ కుంద్రాను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ 2వ సీజన్ లో మియా ఖలీఫా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట పార్ట్ టైం మోడల్ గా తన కెరీర్ ను ఆరంభించిన మియా.. పోర్న్ స్టార్ గా మారి, ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాధించుకుంది. ఇండియాలో సన్ని లియాన్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మియా ఖలీఫాకు మాత్రమే. దాంతో ఈ బిగ్ బాస్ పై మరింత హైప్ క్రియేట్ అయింది. మియా నిజంగానే బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తే.. ఈ సీజన్ సూపర్ హిట్ అవ్వడం ఖాయం.