నెక్లెస్ రోడ్డులో ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ మూవీ టీం.. ‘డాగ్ జాగ్’ రేపే
X
రొటీన్ ఫార్ములాకు భిన్నంగా వస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. పేరుపొందిన యాక్టర్స్, భారీ బడ్జెట్ లేకపోయినా.. కథ, కథనంతో ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు చాలానే ఉన్నాయి. జానర్ ఏదైనా.. కాన్సెప్ట్ బాగుంటే హిట్ గ్యారెంటీ. అలాంటి సినిమాలకు పేరొందిన మైక్ మూవీస్.. స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గురువారం (జూన్ 29) ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.. దానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. యూట్యూబ్ ట్రెండింగ్ లో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ప్రేక్షకులను ఈ సినిమా కాన్సెప్ట్ బాగా నచ్చడంతో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. చిత్ర బృందం డాగ్ జాగ్ ( DOGJOG 1K) నిర్వహిస్తోంది. ఆదివారం (జులై 2) ఉదయం 6 గంటలకు.. హైదరాబాద్, జలవిహార్ దగ్గర్లోని డాగ్స్ పార్క్ లో ఈ ఈవెంట్ ప్రారంభం అవుతోంది. ఈ వాక్ లో హీరో సంజయ్ ఆర్ రావు, హీరోయిన్ ప్రణవి మానుకొండ, మైక్ మూవీస్ నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి. డైరెక్టర్ ఏఆర్ శ్రీధర్ తదితరులు పాల్గొంటారు. ఈ జాగ్ లో తమ పెట్ డాగ్స్ తో పాల్గొనాలని సినిమా యూనిట్ అభిమానుల్ని కోరింది.
ఈ చిత్రం జూలై 21న విడుదల కానుంది. జాతకాలు నమ్మి పెళ్లికి ముందు శని పోగొట్టుకోవడానికి ఓ కుక్కను పెళ్లాడిన ఓ యువకుడి చేష్టలు.. అతని జీవితాన్ని ఏ మలుపు తిప్పాయన్నది కథ. దీనికి అందమైన సకుటుంబ కథను, చిలిపి రొమాన్సును జోడించి ఆబాలగోపాలం చూసే చక్కని చిత్రంగా రూపొందిచారు.