మైక్ మూవీస్ ‘మట్టికథ’ చిత్రానికి అంతర్జాతీయ అవార్డు..
X
మట్టిని నమ్ముకున్నవారి జీవితాలను సరికొత్త కథాకథనంలో చూపిన చిత్రం ‘మట్టికథ’. విడుదల కాకముందే సినీ పండితుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు పొందుతోంది. మైక్ మూవీస్ పతాకంపై అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రతిష్టాత్మక ‘ఇండో-ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్’లో మూడు అవార్డులకు ఎంపికైంది. భారతీయ ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ దర్శకుడు(పవన్ కడియాల), ఉత్తమ నటుడు(అజయ్ వేడ్) అవార్డులను ఈ చిత్రం కైవసం చేసుకుంది. పురస్కారాలపై నిర్మాత అప్పిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంచి సినిమాకు గుర్తింపు తప్పకుండా వస్తుందని అన్నారు.
ప్రజాదరణ పొందిన ‘జార్జిరెడ్డి’, ‘ప్రెజర్ కుకర్’ను నిర్మించిన మైక్ మూవీ ‘మట్టికథ’తో మనకు తెలిసిన, మనం మరచిపోతున్న మన ప్రపంచాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేస్తుంది. పల్లెటూరి కుర్రాడి తన కలలను నెరవేర్చుకోవడానికి పడిన తిప్పలను, భూమితో అనుబంబంధాన్ని, పల్లె సరదాలు, కష్టాలు, ఆత్మీయతను ఇందులో వాస్తవికంగా, కళాత్మకంగా చూపారు. ఈ చిత్రానికి సహనిర్మాత సతీశ్ మంజీర. మాయా, గాయని కనకవ్వ, ‘బలగం’ తాత సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. స్మరణ్ సాయి సంగీతం అందించగా కుంభం ఉదయ్ ఎడిట్ చేశారు.