ట్రెండింగ్‌లో ‘స్లమ్‌డాగ్ హస్బెండ్’.. పక్కా హిట్ అంటున్న నెటిజన్లు
X
కొత్తదనం, సత్తా ఉంటే ప్రేక్షకుల ఆదరణ తప్పక ఉంటుంది. రొటీన్ ఫార్ములాకు భిన్నంగా వస్తున్న సినిమాలు అఖండ విజయాలు సాధిస్తున్నాయి. భారీ తారాగణం, భారీ బడ్జెట్ లేకపోయినా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కామెడీ, సీరియస్, హారర్.. ఏ జానర్ అయినా ఆకట్టుకునేలా ఉండే హిట్ గ్యారంటీ. సరికొత్త కథాకథనాలకు చిత్రాలకు పేరొందిన మైక్ మూవీస్ అలాంటి సినిమాలనే రూపొందిస్తోంది. ఈ సంస్థ కొత్త చిత్రం ‘స్లమ్‌డాగ్ హస్బెండ్’ అలాంటి వినూత్న చిత్రమే. గురువారం విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు ప్రేక్షకులను నుంచి విపరీత స్పందన లభిస్తోంది. యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోల్లో ఈ మూవీ ట్రైలర్ ఏడో స్థానంలో కొనసాగుతోంది. దాదాపు ఏడు లక్షల వ్యూస్ వచ్చిన ఈ ట్రైలర్‌పై యూజర్లు ప్రశంసంల వర్షం కురిపిస్తున్నారు.
డిఫరెంట్, బ్లాక్ బ్లస్టర్
‘‘కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఈ మూవీ హిట్ కావాలి’’ అని కొందరు కోరుతున్నారు. ‘సూపర్బ్ ట్రైలర్. కొత్తవారికి అవకాశాలు ఇస్తే ఇలాంటి అద్భుతాలు సృష్టిస్తారు. ఆ పెళ్లి చేసుకున్న డాగ్ ఫీలింగ్ ఏమిటో చూడాలని ఆత్రంగా ఉంది. మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్నాం’’ అని అంటున్నారు. ఓ అమ్మాయిని ప్రేమించిన ఓ యువకుడు జాతకాలు నమ్మి గండం పోగొట్టుకోవడానికి అసలు పెళ్లికి ముందు ఓ కుక్కను పెళ్లాడి తిప్పలు పడడం ఇందులోని కథ. ప్రియురాలిని పెళ్లాడ్డానికి మొదటి భార్య అయిన కుక్క అడ్డురావడంతో పంచాయితీ కోర్టుకెక్కుతుంది. దీనికి అందమైన సకుటుంబ కథను, చిలిపి రొమాన్సును జోడించి ఆబాలగోపాలం చూసే చక్కని చిత్రంగా రూపొందించారు దర్శకుడు ఏఆర్ శ్రీధర్. రొటీన్ కథలకు భిన్నంగా, సరదాగా సాగే చిత్రం ఇది.
సంజయ్ ఆర్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన ఈ చిత్రం జూలై 21న విడుదల కానుంది. మైక్ మూవీస్ పతకంపై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సునీల్, సప్తగిరి, అలీ, యాదమ్మరాజు తదితరులు నటించారు. డీఓపీ శ్రీనివాస్ రెడ్డి, సంగీతం భీమ్స్ సిసిరోలియో సమకూర్చారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా రూపొందిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’తోపాటు ‘మట్టికథ’ అనే మరో మూవీ త్వరలో విడుదల కానున్నాయి. మైక్ మూవీస్ పతాకంపై వచ్చిన ‘జార్జిరెడ్డి’, ‘ప్రెజర్ కుకర్’ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.