రజనీకాంత్ మమ్మల్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు.. మంత్రి రోజా
X
సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడులో ఎవరినో ఉద్దేశించి మాట్లాడితే దానిపై జనసైనికులు, టీడీపీ వాళ్లు కలిసి తమపై ట్రోల్స్ చేశారని ఏపీ మంత్రి రోజా అన్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై మండిపడ్డారు. ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డు.. ఓటర్ కార్డు..ఇల్లు కానీ లేదన్నారు. హైదరాబాదు నుంచి అప్పుడప్పుడు వచ్చి వైసీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నాడన్నారు. లోకేష్..ఊరు..ఊరికి పోయి మొరుగుతున్నాడన్నారు. ప్రతి ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తూన్నాడన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీని తీసుకొని పవన్ కళ్యాణ్ ఊగిపోతూ.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ తో వైసీపీపై విమర్శలు చేస్తున్నారని రోజా విమర్శించారు.
ఇక సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను తాను విమర్శించలేదన్న రోజా... ‘చంద్రబాబుకి ఓటు వేసి గెలిపించండి.. ఏపీని ఇండియాలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకొస్తారు’ అని రజనీకాంత్ చెప్పడాన్ని ఖండించానన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందన్నామని రోజా తెలిపారు. చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడితే.. రజనీకాంత్ ఇమేజ్ తగ్గుతుందన్నారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు.