Home > సినిమా > "రామ్ చరణ్ ఆ రోజులు మరొకసారి గుర్తుకొచ్చాయి"..మంత్రి రోజా ట్వీట్‌

"రామ్ చరణ్ ఆ రోజులు మరొకసారి గుర్తుకొచ్చాయి"..మంత్రి రోజా ట్వీట్‌

రామ్ చరణ్ ఆ రోజులు మరొకసారి గుర్తుకొచ్చాయి..మంత్రి రోజా ట్వీట్‌
X

మెగా ఫ్యామిలీలో మూడోతరం వారసురాలు ఎంట్రీ ఇచ్చింది. రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డకు జన్మించింది. పెళ్లైన 11 సంవత్సరాల తర్వాత రాంచరణ్ దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటికే చిత్ర పరిశ్రమ నుంచి రామ్ చరణ్- ఉపాసనలకు, తాతయ్య మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు చెబుతున్నారు. తాజాగా మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

‘‘తాత అయినందుకు చిరంజీవి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎప్పుడూ యువకుడి తరహా మనసు, ఎనర్జీతో కూడిన వ్యక్తిత్వంగల మీ కుటుంబంలోకి ఒక లవ్లీ మెగా ప్రిన్సెస్‌ రూపంలో అశీర్వాదం అందించాడు. డియర్ రామ్ చరణ్.. నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నిన్ను నా చేతులతో హత్తుకున్న రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ రోజుల మరొకసారి గుర్తుకొచ్చాయి. అలాంటిది నీకు ఇప్పుడు పాప పుట్టడం సంతోషం. చిరంజీవి సర్.. మీకు తాత అనే పేరు వచ్చినప్పటికీ మీరొక ఎవర్ గ్రీన్ హీరో. ఉపాసన.. మీ ఇంటి చిన్ని మహాలక్ష్మికి ఇవే నా ఆశీస్సులు' అని రోజా ట్వీట్‌ చేశారు.



Updated : 21 Jun 2023 6:27 PM IST
Tags:    
Next Story
Share it
Top