Mirzapur 3 : మీర్జాపుర్ సీజన్ 3 వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..?
X
ఇండియన్ వెబ్ సిరీసుల్లో బాగా హిట్టైన వాటిలో ‘మీర్జాపూర్’ ఒకటి. ఓటీటీలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించింది. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్స్ కు ఓటీటీ ప్రేక్షకుల నుంచి విశేష ఆధరణ లభించింది. దీంతో మూడో సీజన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని మీర్జాపూర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్.. తొలి సీజన్ 2018 నవంబర్ 16న, రెండో సీజన్ అక్టోబర్ 23 2020న విడుదలైంది. పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్రియ పిల్గోంగర్, హర్షిత గౌర్ తదితరులు నటించిన ఫస్ట్ సీజన్‌కు మంచి స్పందన లభించింది.
క్రైమ్, థ్రిల్లర్ యాక్షన్ జానర్ లో వచ్చిన ఈ సిరీస్ కు సంబంధించిన అప్ డేట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మూడో సీజన్ మార్చి చివరి వారంలో అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం చేయనున్నట్లు తెలుస్తుంది. ఏడాది క్రితమే మూడో సీజన్ షూటింగ్ పూర్తైనట్లు నటీ నటులు తెలిపారు. కాగా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులను పూర్తిచేసుకున్న ఈ సిరీస్ విదుదలకు సిద్ధమైంది. మొదటి సీజన్ లో గుడ్డూ భయ్యా, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలను.. మున్నా ఎలా ఇబ్బంది పెట్టాడని చూపించారు. రెండో సీజన్ లో మున్నైపై గుడ్డూ భయ్య ఎలా రివేంజ్ తీర్చుకున్నాడో చూపించారు. ఆ సీజన్ లో మున్నా కథ ముగిసింది. దీంతో మూడో సీజన్ లో ఏం ఉండబోతుంది, ఇందులో విజయ్ వర్మ పాత్ర ఏంటి అనేది ఆసక్తిగా మారింది.