పెళ్ళి వద్దు కానీ పిల్లలు కావాలి అంటున్న అనుష్క
X
అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ మీద నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 7న ఈ సినిమా రిలీజ్ అవనుంది.
మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ కామెడీగా, ఇంట్రస్టింగ్ గా ఉంది. నవీన్ కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయిస్తోంది. అంతేకాదు డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు ఎదురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క ఛెఫ్ గా, నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నారు. నవీన్ తన కన్నా పెద్ద వయసులో ఉన్న అమ్మాయి ఇష్టపడుతుండగా...అనుష్క మాత్రం పెళ్ళి కాకుండానే పిల్లలు కావాలని అంటోంది. అనుష్క్ ఎందుకు అలా అంటోందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మూడేళ్ళ గ్యాప్ తర్వాత అనుష్క తెలుగు సినిమాల్లో కనిపిస్తోంది. ఎప్పటిలానే చాలా అందంగా కనిపిస్తోంది. ఇక నవీన్ పోలిశెట్టి కూడా ఎప్పటిలానే కామెడీతో అదరగొడతాడని అనిపిస్తోంది. కథ కూడా డిఫరెంట్ గా కనిపిస్తుండడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టికి మహేష్ బాబు. పి దర్శకత్వం వహించారు.రాధన్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఈసినిమా పాటలు రిలీజ్ అయ్యాయి. మంచి పేరును తెచ్చుకున్నాయి. మరి మూడేళ్ళ తర్వాత వస్తున్న అనుష్కకు, జాతి రత్నాలు తర్వాత నవీన్ పోలిశెట్టికి ఈ సినిమా హిట్ ఇస్తుందా లేదా అనేది మూవీ రిలీజ్ అయ్యాకనే తెలుస్తుంది.