Home > సినిమా > మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ అనౌన్స్..

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ అనౌన్స్..

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ అనౌన్స్..
X

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో యూత్‌కి ఫేవరేట్ దోస్త్ గా మారిపోయాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. మోస్ట్ ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో, స్టార్ హీరోయిన్, స్వీట్ బ్యూటీ అనుష్క శెట్టితో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ మూవీ టైటిల్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటిస్తున్నారు. ఒక కొత్త బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ ఫీల్ గుడ్ సినిమాని పి.మహేష్‌ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత అనుష్క ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుండటంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఆగస్టు 4న థియేటర్స్ లోకి రానున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించారు. "నవ్వి నవ్వి ఏడుస్తారు… టిష్యూస్ తెచ్చుకోండి… మాములుగా ఉండదు" అంటూ యూవీ క్రియేషన్స్ ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతో సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులో నవీన్ పోలిశెట్టి ఫుల్ గా నవ్విస్తాడని సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Updated : 3 July 2023 3:15 PM IST
Tags:    
Next Story
Share it
Top