Home > సినిమా > ఆ గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది గురూ..ధనుష్ పాట అదర్సు

ఆ గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది గురూ..ధనుష్ పాట అదర్సు

ఆ గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది గురూ..ధనుష్ పాట అదర్సు
X

యంగ్ అండ్ డైనమిక్ హీరో నవీన్ పోలిశెట్టి, స్వీటీ కాంబినేషన్‎లో వస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కోసం ధనుష్ పాడిన పాటను మూవీ మేకర్స్ బుధవారం విడుదల చేశారు. రామ జోగయ్య శాస్త్రి రాసిన హతవిధీ ఏందిదీ.. ఊహలో లేనిదీ.. బుల్లిచీమ బతుకుపై బుల్డోజరైనదీ, అంటూ సాగిన ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడాడు ధనుష్. ఈ సాంగ్ చాలా స్లోగా సాగినా ధునుష్ వాయిస్‎లో ఏదో తెలియని మ్యాజిక్ ఉందని తెలుగు ప్రేక్షకులు ఆయన వాయిస్‎కు ఫిదా అవుతున్నారు. ఈ లిరికల్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హంగామా చేస్తోంది. నెటిజన్లు ధనుష్ పాట అదుర్స్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ధనుష్ పాట పాడటం కొత్తేమి కాదు. తమిళంలో ఇప్పటికే చాలా పాటలు పాడి అక్కడి ప్రేక్షకులను అలరించాడు. తాజాగా తెలుగులోనూ తన సింగింగ్ ట్యాలెంట్‎తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాడు.




యూవీ క్రియేషన్స్ బ్యానర్‎లో మహేష్‌ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో స్టాండప్ కమెడియన్ నవీన్ పొలిశెట్టి, చెఫ్‎గా అనుష్క కనిపించనున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రం అనుష్క నటిస్తున్న 48వ చిత్రం. ఇదే బ్యానర్‎లో అనుష్క ఇదివరకే మిర్చి, భాగమతి చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలూ భారీ విజయాన్ని సాధించాయి. ఇక తాజాగా విడుదలైయ్యే చిత్రం కూడా మంచి హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.





Updated : 31 May 2023 2:40 PM IST
Tags:    
Next Story
Share it
Top