మీడియాపై మోహన్ బాబు ఫైర్.. ‘మీకు బుద్ధి లేద’ని తిడుతూ...
X
డైలాగ్ కింగ్ మోహన్ బాబు మీడియాపై మరోసారి ఫైర్ అయ్యారు. షాద్ నగర్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ వచ్చిన మోహన్ బాబు చుట్టు మీడియా చేరి ప్రశ్నలు గుప్పించారు. మీడియాను చూడగానే మోహన్ బాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ‘లోగోలు (కెమెరాలు) లాక్కోండయ్యా’అంటూ బౌన్సర్లకు సూచించాడు. ‘మీకు బుద్ధి లేదా’అంటూ తన నోటికి పని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ బాబు తీరుపై మీడియా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదివరకు కూడా మీడియాతో మోహన్ బాబు ఇలానే ప్రవర్తించాడు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తోసుకుంటూ వెళ్లిపోయాడు.
మీడియా పై మోహన్ బాబు ఆగ్రహం -
— Dial News (@dialnewsinfo) July 13, 2023
మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసిన సినీనటుడు మోహన్ బాబు - ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో షాద్ నగర్ లోని స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చిన మోహన్ బాబు -#MohanBabu #Filmactor #Tollywood pic.twitter.com/XM2gwIZXKc