Dulquer Salmaan : ఆమె నన్ను ఇబ్బందికరంగా తాకింది.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్
X
దుల్కర్ సల్మాన్.. తన సినిమాలతో తెలుగులోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. మహానటితో తెలుగులో అడుగుపెట్టిన ఈ హీరో.. సీతారామంతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. మలయాళంలో అతడు నటించిన సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం అతడు నటించిన కింగ్స్ ఆఫ్ కోత సినిమా అగస్ట్ 24న రిలీజ్ కానుంది.
తాజాగా తనకు ఎదురైన ఇంట్రెస్టింగ్ విషయాలను దుల్కర్ చెప్పారు. ఓకే బంగారం, సీతారామం సినిమాలతో తనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందన్నారు. ‘‘ఫ్యాన్స్ వల్ల ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత మంది మహిళలు ఫొటో దిగుతూ ముద్దుపెట్టాలని చూస్తారు. వాళ్లు అలా చేయడం చూసి ఆశ్చర్యపోయా. ఓ రోజు స్టేజీపై ఒక పెద్దావిడ నన్ను అభ్యంతరకరంగా తాకింది. ఆమె వల్ల ఎంతో ఇబ్బంది పడ్డా.. నాకు ఎంతో బాధ అనిపించింది’’ అని చెప్పారు.
తన పెళ్లికి సంబంధించిన విషయాలను కూడా దుల్కర్ చెప్పారు. 28 ఏళ్ల వయసులోనే తనకు పెళ్లైందన్నారు. ‘‘అమాల్ సోఫియా, నేనూ ఒకే స్కూల్‌లో చదువుకున్నాం. తనని కలిసినప్పుడే ఆమె నా జీవితం, కుటుంబంలో భాగమని అర్థమైంది. అంతకు ముందు ఏ అమ్మాయిని చూసినా నాకు ఆ ఫీలింగ్ కలగలేదు. పెళ్లి, కెరీర్.. నాకు ఒకే సమయంలో మొదలయ్యాయి. పెళ్లైన కొద్దిరోజుల్లోనే రెండో సినిమా షూటింగ్లో పాల్గొన్నా. కొంచెం ఫ్రీ టైం దొరికినా తనతో గడపటానికి ఇష్టపడుతా’’ అని వివరించారు. కాగా కింగ్ ఆఫ్ కోత మూవీని అభిలాష్ జోషి డైరెక్ట్ చేశారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటిస్తోంది.