ఆదిపురుష్ సినిమాకు అతిథిగా వచ్చిన హనుమంతుడు
X
రామాయణ కథాంశంతో తెరకెక్కిన 'ఆదిపురుష్' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా నటించారు. రాముడి పాత్రలో ప్రభాస్ అద్భుతంగా నటించారంటూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు.
అయితే ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో .. ప్రతి థియేటర్ తో హనుమంతుడి కోసం ఒక సీట్ ను ఖాళీగా ఉంచాలని దర్శకుడు ఓం రౌత్ కోరిన విషయం తెలిసిందే. రాముడి కథ ఎక్కడ చెప్పిన అక్కడికి హనుమంతుడు వస్తాడని ప్రతీతి. హనుమంతుడు స్వయంగా విచ్చేసి రామాయణ గాధను వీక్షిస్తారని ప్రజల నమ్మకం.ఇందుకోసం థియేటర్ లో ఒక సీట్ హనుమంతుడికి కోసం కేటాయించారు. కాగా ఆదిపురుష్ సినిమా ప్రదర్శితం అవుతున్న ఒక థియేటర్ లో కోతి ప్రత్యేక్షమయ్యింది. థియేటర్ విండోలో నుంచి వచ్చిన ఆ కోతి ఆదిపురుష్ సినిమాని చూస్తుంటే ఒక అభిమాని వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్ అవగా.. ఆదిపురుష్ మూవీ టీం కూడా ఆ వీడియోని రీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. హనుమంతుడు రాముడి సినిమాకు వచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇది నిజంగా అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు థియేటర్ కు కోతి సందర్భాలు తక్కువే. ఒకవేళ వచ్చిన ఆ ఈలలు, గోలలకు, అరుపులకు అక్కడి నుంచి పారిపోతాయి. కానీ ఇప్పుడు అలా జరగలేదు.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, దశరథుడిగా.. తండ్రీకొడుకుల పాత్రలో కనిపించాడు. ఇక సినిమాలో హైలైట్స్ విషయానికి వస్తే.. రాముడు మరియు రావణాసురుడి ఎంట్రీ గూస్‌బంప్స్ వచ్చేలా చేస్తాయట. అలాగే హనుమాన్ సంజీవని తెచ్చే సీన్, లంకాదహనం సీన్స్ అదిరిపోయిని అని టాక్. ముఖ్యంగా సెకండ్ పార్ట్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రతిఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్నాయి అంటున్నారు. ఇక శబరి మరియు సుగ్రీవుడుతో రాముడు సన్నివేశాలు అయితే ఎమోషనల్ గా ఉన్నాయని చెబుతున్నారు.
Hanumanji watching the movie #JaiShriRam #JaiBajarangBali #Adipurush https://t.co/jTNDYfNMz5
— #Adipurush 🇮🇳 (@rajeshnair06) June 16, 2023