'హనుమాన్' కాన్సెప్ట్‌తో హాలీవుడ్ మూవీ.. 'మంకీ మ్యాన్' ట్రైలర్2 రిలీజ్
X
సినీ ఇండస్ట్రీలో హిందూ మైథాలజీ కాన్సెప్ట్ మూవీస్ పెరుగుతున్నాయి. పురాణ గాథల మీద తీస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుండటంతో వీటి ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పుడు పురాణాల్లోని హనుమంతుడి పాత్ర స్ఫూర్తితో 'మంకీ మ్యాన్' మూవీ హాలీవుడ్‌లో రూపొందుతోంది. 'స్లమ్ డాగ్ మిలియనీర్' 'హోటల్ ముంబై' ఫేమ్ దేవ్ పటేల్ స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ హీరోయిన్‌గా చేస్తోంది.
'మంకీ మ్యాన్' మూవీ నుంచి ఇదివరకే ఓ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఇప్పుడు సెకండ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. చిన్నతనంలోనే తల్లితో పాటు అన్నీ కోల్పోయిన ఓ సామాన్యుడి కథే 'మంకీ మ్యాన్'. ధనవంతులు మమ్మల్ని మనుషులుగా కూడా చూడరు అంటూ మంకీ మ్యాన్ ట్రైలర్2 ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పేద ప్రజలను కాపాడేందుకు హనుమంతుడి స్ఫూర్తితో ఫైట్స్ చేస్తాడు.
వెయిటర్ నుంచి ఫైటర్ మారిన ఓ యువకుడి కథ అని ట్రైలర్2ను చూస్తేనే తెలుస్తోంది. తల్లి మరణానికి కారణమైన వారిపై హీరో రివేంజ్ తీర్చుకుంటాడు. ఒక మనిషి దేవుడిని సవాలు చేస్తే.. అతను మనిషి కంటే ఎక్కువగా, మృగం కంటే ఎక్కువగా మారాలి అని చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్‌కు హైలెట్ అని చెప్పాలి. విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి. మంకీ మాస్క్ వేసుకుని చేసే ఫైట్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఏప్రిల్ 5న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు సినిమా హనుమాన్ స్ఫూర్తితో ఆ కాన్సెప్ట్ లాగానే ఈ 'మంకీ మ్యాన్' మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.