మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ పెళ్లి..అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఇదే ..
X
తెలుగు మేల్ యాంకర్లలో నెంబర్ వన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రదీప్ మాచిరాజు . బుల్లితెరపైన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్.. తనదైన యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రదీప్ కామెడీ టైమింగ్‌కు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ఒకవైపు టీవీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే 37 ఏళ్ళు నిండుతున్నా ప్రదీప్ ఇంకా పెళ్లి చేసుకోలేదు ..దీనితో తరచూ పెళ్లి రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే గతంలో పలుమార్లు ప్రదీప్ పెళ్లంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చెక్కర్లు కొట్టాయి. అయితే వాటిని ప్రతిసారి ప్రదీప్ ఖండిస్తూ వచ్చాడు. కానీ ఈసారి మాత్రం ప్రదీప్ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రదీప్ చేసుకోబోయే అమ్మాయి పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత కొంతకాలంగా ప్రదీప్ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని..ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో రెండు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ప్రదీప్ పెళ్లి గురించి అప్పట్లో ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు ఒక షోని కూడా నిర్వహించారు, కానీ ఆ షో చాలా విమర్శలని ఎదుర్కుంది. దాంతో ఆ షోని అర్థాంతరంగా ఆపేశారు. అయితే ప్రదీప్ ఇప్పుడు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. తన అభిమానులందరికీ ఒక సడన్ సర్ప్రైజ్ లాగా తన పెళ్లి విషయాన్ని చెప్పేందుకు ప్రదీప్ ప్లాన్ చేస్తున్నాట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిది బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ అని సమాచారం. అంతే కాదు ఆమె కూడా బిజినెస్‌లో రాణిస్తుందని అంటున్నారు .ఇక ఆ అమ్మాయి ప్రదీప్ ఫ్యామిలీకి బాగా నచ్చిందట. అయితే ఈ విషయం నిజమా లేదా అనే విషయం తెలియాలి అంటే మాత్రం ప్రదీప్ స్పందించే వరకు ఎదురుచూడాల్సిందే.