‘సలార్’ ట్రైలర్ రిలీజ్ వాయిదా?.. కారణం ఏంటంటే?
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ల కొత్త సినిమా సలార్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై.. అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులను సలార్ చెరిపేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజీఎఫ్ లో మదర్ సెంటిమెంట్ ఉంటే.. ఈ సారి ఫ్రెండ్స్ స్టోరీతో వస్తున్నాడు. తన స్నేహితుడి కోసం ప్రాణాలు అడ్డుపెట్టే మరో గొప్ప స్నేహితుడి కథే ఇదని ముందు నుంచీ చెప్తూ వస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే ఈ వార్తలే కన్ఫార్మ్ అయిపోయింది.
కాగా ఈ సినిమా రెండో ట్రైలర్ ఇవాళ విడుదల కావాల్సి ఉంది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత డబుల్ అవుతాయని అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా అభిమానులకు సలార్ టీం షాకిచ్చింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సమస్యను అదిగమించి రేపు సాయంత్రం ట్రైలర్ విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ నటించింది.
#Salaar release trailer tomorrow
— Indian Cinema Hub (@IndianCinemaHub) December 17, 2023
💥💥💥#Prabhas #SalaarCeaseFire #SalaarReleaseTrailer pic.twitter.com/ktw7vTWt6b