మిస్టర్ ప్రెగ్నెంట్ ఎన్ని కోట్లు రాబట్టిందంటే..!
X
బిగ్ బాస్ ఫేం సోహైల్ హీరోగా వచ్చిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. ఆగస్ట్ 18న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో సోహైల్ కు జంటగా రూపా కొడువాయుర్ కనిపించింది. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో మూవీ కలెక్షన్స్ రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజైన 4 రోజుల్లోనే రూ.4.6కోట్లు రాబట్టింది. ఈ మేరకు మూవీ యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. మిస్టర్ ప్రెగ్నెంట్ తో సోహైల్ హిట్ కొట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు చెబుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు
మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.