మగాడు ప్రెగ్నెంట్ అయితే?.. ‘హవ్వ.. కలికాలం’
X
‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. శనివారం (ఆగస్టు 5) దసపల్లా హోటల్ లో సాయంత్రం 4గంటలకు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కింగ్ నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ లాంఛ్ చేశారు.
‘నా పేరు గౌతమ్.. అందరి లైఫ్ లో ఉన్నట్లే నాదీ మంచి క్రేజీ లైఫ్. క్రేజీ గర్ల్ ఫ్రెండ్.. కానీ, నా లైఫ్ లో ఓ క్రేజీ ట్విస్ట్ కూడా ఉంది’ అంటూ ట్రైలర్ మొదలవుతుంది. ‘హి ఈజ్ మిస్టర్ ప్రెగ్నెంట్’ అంటూ నటి సుహాసిని చెప్పడంతో.. కథలో ట్విస్ట్ మొదలవుతుంది. ఒక మగాడు ప్రెగ్నెంట్ అవ్వడాన్ని ఈ సొసైటీ ఎలా చూస్తుంది? ఎలా అవమానిస్తుంది? హీరో ఎలా సర్వైవ్ అయ్యాడు? అందులో హీరో పడ్డ కష్టం, బాధనే కథ. ట్రైలర్ చూస్తుంటే ఫీల్ తెప్పింస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడదగ్గ సినిమా ఇది. సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్ ను మైక్ మూవీస్ ఈ సినిమా ద్వారా అదిస్తున్నారు. ఈ సినిమాలో సుహాసినీ, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మిస్టర్ ప్రెగ్నెంట్ నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.