కింగ్ చేతుల మీదుగా మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ లాంఛ్
X
‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్షన్ లో తెరకెక్కించిన మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ట్రైలర్ లాంఛ్కు ముహూర్తం ఫిక్స్ చేసింది.
ఆగస్ట్ 5న కింగ్ నాగార్జున చేతుల మీదుగా మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ లాంఛ్ చేయనున్నారు. దసపల్లా హోటల్ లో సాయంత్రం 4గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు మూవీ యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
మిస్టర్ ప్రెగ్నెంట్ కు సంబంధించి మూవీ యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సోహైల్ ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు.