Home > సినిమా > యూట్యూబ్లో దుమ్ములేపుతున్న మిస్టర్ ప్రెగ్నెంట్ సాంగ్

యూట్యూబ్లో దుమ్ములేపుతున్న మిస్టర్ ప్రెగ్నెంట్ సాంగ్

యూట్యూబ్లో దుమ్ములేపుతున్న మిస్టర్ ప్రెగ్నెంట్ సాంగ్
X

మిస్టర్ ప్రెగ్నెంట్.. బిగ్ బాస్ ఫేం సోహెల్, రూపా కొడవాయుర్ జంటగా నటిస్తున్న మూవీ. శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైక్ మూవీస్ బ్యానర్పై అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు సోషల్ మీడియాలో అదరగొడుతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన సెకండ్ సాంగ్ నరసపల్లి పాట యూట్యూబ్లో దుమ్ములేపుతోంది.

కనకవ్వ రాసి పాడిన ఈ పాటకు సోహెల్ మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ పాటకు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సైతం పూర్తి చేసుకున్న మిస్టర్ ప్రెగ్నెంట్ ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సుహాసిని, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు నటిస్తున్నారు. కెమెరామెన్ నిజార్ షఫి కాగా.. రొన్నీ ఆడమ్స్ సంగీతం సమకూర్చారు.




Updated : 18 July 2023 3:20 PM IST
Tags:    
Next Story
Share it
Top