ప్రభాస్ ప్రేయసిగా మృణాల్.. కల్కిలో ప్రత్యేక పాత్ర
X
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘కల్కి 2898AD’ మూవీ భారీ ఎత్తున తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు. హిందూ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఇందులో ప్రభాస్ మహా విష్ణువు దశావతారాల్లోని కల్కి పాత్రను పోషిస్తున్నారు.
ఇతిహాసాల్లో చెప్పిన విధంగా ఏడుగురు చిరంజీవులు పాత్రలను ఇందులో చూపించనున్నారు. సప్త చిరంజీవులుగా రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్, నాని, కమల్ హాసన్ వంటివారు కనిపించనున్నారు. గత కొన్ని రోజులుగా ఈ పాత్రలపై వార్తలు సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కూడా ఓ ప్రత్యేక పాత్ర చేస్తోందట.
కృష్ణుడి ప్రేయసి అయిన రాధ పాత్రలో మృణాల్ కనిపించనుందట. ప్రభాస్ ప్రేయసిగా ఈ భామ కనిపించనుందని తెలియడంతో ఆ వార్త నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మరో విషయం ఏంటంటే ఈ మూవీ స్టోరీని శ్రీపద్మనాభస్వామి గుడిలోని ఆరో తలుపు రహస్యంతో లింక్ చేసినట్లుగా ఉందట. మొత్తానికి ఈ వార్తలు నిజమా? కాదా? అని తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకూ ఎదురుచూడాల్సిందే.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.