Home > సినిమా > హీరోగా ఎంట్రీ ఇస్తాడనుకుంటే విలన్ అంటున్నారేంటీ?

హీరోగా ఎంట్రీ ఇస్తాడనుకుంటే విలన్ అంటున్నారేంటీ?

హీరోగా ఎంట్రీ ఇస్తాడనుకుంటే విలన్ అంటున్నారేంటీ?
X

వెంకట్ ప్రభు...తమిళ్ లో పెద్ద డైరెక్టర్. చిన్నహీరోల నుంచీ పెద్ద పెద్ద హీరోల వరకూ సినిమాలు చేసి హిట్ లు కొట్టారు. ప్రస్తుతం విజయ్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఇందులోనే మన మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీని విలన్ గా చూపించనున్నారుట వెంకట్ ప్రభు.





దళపతి 68వ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం లియో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్ దీని తర్వాత ఈ సినిమా చేయనున్నారు. వచ్చే నెల నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళుతుందని చెబుతున్నారు. ఇప్పుడు దీని గురించే ఒక క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోనే విజయ్ కు ఆపోజిట్ గా, విలన్ గా ధోనీ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అఫీషియల్ గా ఎక్కడా సమాచారం మాత్రం రాలేదు.





ఈమధ్యనే ధోనీ సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. నిర్మాణ రంగంలో కెరీర్ మొదలుపెట్టిన ధోనీ త్వరలోనే యాక్షన్ హీరోగా వస్తాడని ఆయన భార్య సాక్షి అనౌన్స్ కూడా చేశారు. అలాంటిది ఇప్పుడు విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారనే వార్త బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కెస్టెన్ కూల్ గా పేరు తెచ్చుకున్న ధోని విలన్ గా సరిపోతారా అంటూ అడుగుతున్నారు.





వెంకట్ ప్రభు, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీకి ఇంకా పేరు పెట్టలేదు. దీనికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తర్వలో వెలువడే అవకాశాలున్నాయి.


Updated : 17 Aug 2023 1:54 PM IST
Tags:    
Next Story
Share it
Top