Home > సినిమా > నితిన్కు ధోనీ సర్ప్రైజ్ గిఫ్ట్

నితిన్కు ధోనీ సర్ప్రైజ్ గిఫ్ట్

నితిన్కు ధోనీ సర్ప్రైజ్ గిఫ్ట్
X

నితిన్, శ్రీ లీల జంటగా వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్. వక్కంతం వంశీ దర్శకుడుగా ఫస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ అవ్వగా.. ఇటు నితిన్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. దీంతో ఈ కాంబోలో సినిమా అనౌన్స్ అయినప్పుడు పెద్దగా ఆసక్తి చూపించలేదెవరూ. బట్ ఫస్ట్ సాంగ్తో ఆకట్టుకోవడంతోపాటు టీజర్తో మెప్పించారు. లేటెస్ట్గా ట్రైలర్తో దుమ్ములేపారు. ఈ ట్రైలర్ చూస్తే కంప్లీట్ ఎంటర్టైనర్లా ఉంది.

ఈ క్రమంలో నితిన్కు టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అందింది.

ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్ సినిమా డిసెంబర్ 8న రిలీజ్ అవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నితిన్కు విషెస్ చెబుతూ ధోనీ ఒక జెర్సీని పంపారు. ఆ జెర్సీపై ధోనీ సంతకం ఉండడం విశేషం. ఈ విషయాన్ని నితిన్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘‘ఎక్స్ట్రార్డినరీ వ్యక్తి నుంచి ఎక్స్ట్రార్డినరీ గిఫ్ట్ లభించింది. ఈ జెర్సీ పంపినందుకు థాంక్యూ ధోనీ సర్. లవ్ యూ.. ’’ అంటూ నితిన్ ట్వీట్ చేశారు. దీనికి ధోనీ పంపిన జెర్సీ ఫొటోను జత చేశారు.

ms dhoni surprise gift to hero nithiin

ms dhoni,nithiin,nithiin new movie,dhoni gift to nithiin,dhoni gift,dhoni gift to telugu hero,extra ordinary man,extra ordinary man trailer,sreeleela,vakkantham vamsi,harris jayaraj,tollywood,kollywood,bollywood,

Updated : 29 Nov 2023 10:00 PM IST
Tags:    
Next Story
Share it
Top