M. S. Swaminathan : హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్ స్వామినాథన్ కన్నుమూత
X
'హరిత విప్లవం' ద్వారా భారతీయ వ్యవసాయాన్ని మార్చిన ప్రముఖ జన్యు, వ్యవసాయ శాస్త్రవేత్త మంకొంబు సాంబశివన్ స్వామినాథన్.. కాసేపటి క్రితం కన్నుమూశారు. 98 ఏండ్ల వయస్సున్న ఆయన గురువారం(సెప్టెంబరు 28) ఉదయం 11 గంటలకు చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆహార వృద్ధిలో భారత్ స్యయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు. తన మేలైన పరిశోధనలతో మేలైన వరి వంగడాలను సృష్టించారు.
భారత దేశ వ్యవసాయ పితామహుడిగా పిలుచుకునే స్వామినాథన్ .. 1925 ఆగస్టు 7 న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. స్వామినాథన్ చెన్నైలో MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించిన తర్వాత 1987లో మొదటి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు . 1989 లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. అనేక అవార్డులతో పాటు, స్వామినాథన్ రామన్ మెగసెసే అవార్డు (1971) మరియు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు (1986)ను సైతం అందుకున్నారు. స్వామినాథన్‌కు భార్య మినా, ముగ్గురు కుమార్తెలు( సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యా స్వామినాథన్) ఉన్నారు.