రామ్ చరణ్ కూతురికి....ముఖేష్ అంబానీ ఖరీదైన గిఫ్ట్
X
పెళ్లైన 11 ఏళ్ల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన విషయం తెలిసిందే. జూన్ 20న మంగళవారం రోజు మెగా ఇంట మెగా వారసురాలు పుట్టడంతో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఈ స్టార్ కిడ్‌కు అభిమానులు, కుటుంబం సభ్యులు , స్నేహితులు గొప్పగా స్వాగతం పలికారు. పాప జాతకం కూడా చాలా బాగుందని చిరంజీవి తెలియజేశారు. తాజాగా మెగా వారసురాలి బారసాల కార్యక్రమం శుక్రవారం జరుగనుంది. సంప్రదాయం ప్రకారం ఉపాసన పుట్టింట్లో ఈ వేడుక జరుగనుంది. ఈ క్రమంలో అపర కుభేరుడు ముఖేష్ అంబానీ దంపతులు పాప కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ పంపించినట్లు తెలుస్తోంది.
ఉపాసన పుట్టింట్లో మెగా ప్రిన్సెస్ బారసాల ఘనంగా జరుగనుంది. తన కూతురికి ఈ రోజు పేరు పెడుతున్నామని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు చాలా మంది ప్రముఖులు ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్- ఉపాసన దంపతులకు రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ నుంచి ఒక ప్రత్యేక కానుక వచ్చిందని ప్రచారం జరుగుతుంది. పాప బారసాల కావడంతో బంగారంతో తయారు చేసిన ఊయలను అంబానీ పంపించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ బంగారు ఊయల కోసం కోటి రూపాయలకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఇప్పటి వరకు ఎవరూ ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే చరణ్, ఉపాసనలు తమ పాప కోసం ప్రత్యేకంగా ఓ హ్యాండ్ క్రాఫ్ట్ ఊయలను కొనుగోలు చేశారు.మరోవైపు ప్రముఖ సింగర్ కలాభైరవ కూడా చిన్నారి కోసం ఓ స్పెషల్ ట్యూన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఆమె పుట్టకముందే, కొత్త తల్లిదండ్రులు తమ నవజాత శిశువు కోసం హ్యాండ్‌క్రాఫ్ట్ ఊయలని కొనుగోలు చేశారు, ఇది మానవ అక్రమ రవాణా నుండి బయటపడిన వారిచే తయారు చేయబడింది. ఇది స్థితిస్థాపకత, ఆశ మరియు ఆత్మగౌరవాన్ని సూచిస్తుంది. RRR గాయకుడు కాల భైరవ కూడా చిన్నపిల్ల కోసం ప్రత్యేకమైన మరియు అర్థవంతమైన ట్యూన్‌ను రూపొందించారు