రోజుకు నా సంపాదన రూ.4 లక్షలు..కానీ..షకీలా
X
షకీలా ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఈమె పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. షకీలా నటించిన మలయాళం చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు యూత్ థియేటర్ల ముందు వాలిపోయేవారు. అంతెందుకు సూపర్ స్టార్ హీరోలే షకీలా సినిమా వస్తుందంటే కంగారుపడిపోయేవారు. వారి రిలీజ్ డేట్లను మార్చుకునేవారు. అంతటి క్రేజ్ ఉన్న శృంగార కథానాయిక షకీలా. అప్పట్లో మలయాళంలో కేవలం గంటల కాల్‌షీట్స్ ఇచ్చి తన పెర్ఫార్మెన్స్తో మోస్ట్ వాంటెడ్ నటిగా పేరు కూడా సంపాదించుకుంది. ఆమె రెమ్యునరేషన్ ముందు హీరోయిన్లు కూడా పనికిరారు. ఒక్క రోజు షూటింగ్ కోసం రూ.4 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంది షకీలా. అలాంటి నటి ఇప్పుడు అడపా దడపా వస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ సాదాసీదాగా కాలాన్ని వెల్లదీస్తున్నారు. అయితే ఈ మధ్యనే షకీలా బాగా సంపాదించిందని, ఆమె బీఎండబ్ల్యూ కారులో షికారు చేస్తోందని రూమర్స్ వచ్చాయి. అయితే అవేమీ నిజం కావంటూ రూమర్స్‌పై స్పందించారు షకీలా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సొంతవారే తనను మోసం చేశారని చెప్పుకొచ్చింది.
ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ.." అప్పట్లో నటిగా బాగా ఆస్తులు సంపాదించాను. రోజుకు రూ.4లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునేదానిని. అయితే నా ఆస్తులన్నీ అయినవారే కొట్టేశారు. ఇన్కమ్ ట్యాక్స్ వారు వచ్చి ఆస్తులు జప్తు చేస్తారని చెప్పి వారి పేరుమీద ఉన్న ఆస్తులన్నీ రాయించుకున్నారు. నన్ను మోసం చేశారు. నాకు ఇప్పుడు ఆస్తులేమీ లేవు. ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంట్లో ఉంటున్నాను. అలాంటిది నాకు బీఎండబ్ల్యూ కారు ఉన్నట్లు వదంతులు వస్తున్నాయి. అందులో నిజం లేదు"అంటూ షకీలా చెప్పుకొచ్చారు.