Home > సినిమా > దుమ్ములేపుతున్న `బ్రో` సాంగ్...

దుమ్ములేపుతున్న `బ్రో` సాంగ్...

దుమ్ములేపుతున్న `బ్రో` సాంగ్...
X

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, అతని మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ చిత్రం నుంచి మొదటి పాట వచ్చేసింది. ‘మై డియర్‌ మార్కండేయ మంచి మాట చెబుతా రాసుకో’ అనే పాటను శనివారం సాయంత్రం చిత్ర బృందం విడుదల చేసింది. పాట విడుదలైన కాసేపటికే యూ ట్యూబ్‎లో రాకెట్ స్పీడ్‎లో దూసుకుపోతోంది. ఈ పాట ఆధ్యంతం కలర్ ఫుల్‌గా, మంచి బీట్‌ను కలిగి ఉండడంతో అభిమానలు ఎంజాయ్ చేస్తున్నారు.

`బ్రో` టైటిల్‌ సాంగ్‌ గా దీన్ని డిజైన్‌ చేసినట్టు ఉంది. పాటలో పవన్ , సాయిధరమ్ తేజ్ లు అలరించారు. లిరిక్‌ని సాయితేజ్‌ ప్రారంభించి డ్యాన్స్ వేస్తుండగా..మధ్యలో వచ్చిన పవన్ ఎంట్రీ అదిరిపోయింది. ఈ పాటని రేవంత్‌, సిగ్దాశర్మ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి రాయగా థమన్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. కింద ఉన్న పాటపై మీరు ఓ లుక్కేయండి.


Updated : 8 July 2023 6:58 PM IST
Tags:    
Next Story
Share it
Top