Home > సినిమా > నా కల నిజమైంది..సమంత ఎమోషనల్ పోస్ట్

నా కల నిజమైంది..సమంత ఎమోషనల్ పోస్ట్

నా కల నిజమైంది..సమంత ఎమోషనల్ పోస్ట్
X

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్‎లో వచ్చిన సినిమా ఖుషి. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సెప్టెంబర్1 థియేటర్లలో విడుదలైంది. వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన సమంతకు ఈ సినిమా సక్సెస్ ఎంతో ముఖ్యం. గుణశేఖర్ డైరెక్షన్‎లో ఆమె నటించిన శాకుంతలం, అంతకు మందు చేసిన యశోద సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో తన ఆశలన్నీ ఖుషిపైనే పెట్టుకుంది. తన ఆనారోగ్య సమస్యను సైతం పక్కన పెట్టి సినిమా సక్సెస్ కోసం ఆమె చాలా కష్టపడింది. ఆమె శ్రమకు తగ్గట్లుగానే ఖుషి హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

లేటెస్టుగా, ఖుషి సినిమా రిజల్ట్‌పై సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగమైన పోస్టును షేర్ పెట్టింది. ‘‘ ఇది అంత సులభం కాదు, జీవితాన్ని ఆసక్తికరంగా మార్చే నా కల నిజమైంది. ఖుషి కి ధన్యవాదాలు. మీరు నన్ను మళ్లీ అదృష్టవంతురాలిగా మార్చారు’ అని వరుసగా తన చిత్రాలను షేర్ చేసింది. అది చూసిన సామ్ ఫ్యాన్స్ నువ్వు సాధించావు అంటూ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Updated : 2 Sept 2023 1:34 PM IST
Tags:    
Next Story
Share it
Top