Rashmika Mandanna : యానిమల్ సక్సెస్ను అందుకే ఎంజాయి చేయలేదు..రష్మిక
X
(Rashmika Mandanna) వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక. ఇటీవలే ఆమె నటించిన యానిమల్ మూవీ సంచలనమైన విజయాన్ని సాధించింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్ గా రణబీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే. ఈ మూవీ విజయంలో రష్మిక కీలక పాత్ర వహించింది. ఆమె నటనతో అందరిని మనసు దోచుకున్నారు. అయితే ఈ విజయాన్ని రష్మిక మిగతా వాళ్ల స్థాయిలో ఎంజాయి చేయలేకపోయారనే అభిప్రాయాలు వస్తున్నాచి. మూవీ రిలీజ్ అయిన తర్వాత జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఆమె కనిపించలేదు. దీనిపై ఇన్ స్టా ద్వారా స్పందించారు రష్మిక. బీజీ షెడ్యూల్ కారణంగానే తనకు అంత టైం దొరకలేదని అన్నారు. మూవీ రిలీజ్ అయిన నెక్ట్ డే నుంచే తను ఒప్పుకున్న ఇతర సినిమాల కోసం సెట్స్‌కి రావాల్సి వచ్చిందని చెప్పారు.
తన పైన ఉన్న ప్రేమతోనే ఈ ఆందోళన అని తనకు తెలుసన్నారు. మేం ఓ మంచి చిత్రాన్ని అందించామని, ప్రేక్షకులు దాన్ని ఇష్టపడ్డారు, ప్రశంసించారని తెలిపారు. అందరిలానే తను కూడా ఈ సినిమా విజయాన్ని ఆస్వాదించడానికి కొంత సమయం కేటాయించాలనుకున్నానని తెలిపారు. కానీ మరుసటి రోజు నుంచే బిజీ షెడ్యూల్ ఉండడంతో అది కుదరలేదని చెప్పారు. తన కెరీర్‌లో అతి పెద్ద, కీలకమైన సినిమాల్లో నటిస్తున్నానని ఫ్యాన్స్ కు తెలిపారు. ఆ సినిమాల కోసం రాత్రిళ్లూ జర్నీ చేయాల్సి వస్తోందన్నారు. పని విషయంలో తనకున్న నిబద్ధత అదని...అందుకే చాలా వేడుకల్లో పాల్గొనలేకపోయానని చెప్పుకొచ్చారు. తనను మిస్ అవుతారని తనకు తెలుసని..తను చేస్తున్న సినిమాలు ఆ లోటుని తీరుస్తాయని అవి అంతగా అలరిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తను నటించిన మూవీలను ప్రేక్షకులంతా ఆస్వాదించే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లూ పోస్ట్ చేశారు రష్మిక. అయితే ప్రస్తుతం ఆమె ‘పుష్ప: ది రూల్’తోపాటు ‘ది గర్ల్‌ప్రెండ్’, ‘రెయిన్‌బో’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.