Home > సినిమా > ఓటీటీలోకి నా సామిరంగ...స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి నా సామిరంగ...స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి నా సామిరంగ...స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

జనాల్లో ఓటీటీలకు పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏ మూవీ రిలీజ్ అయినప్పటికీ నెల తర్వాత ఓటీటీలోకి రావాల్సిందే. థియేటర్ల కంటే కూడా ఓటీటీలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దీంతో మూవీ ఓటీటీ రైట్స్ ని ఎక్కువ పెట్టి మరి కొనుగోలు చేస్తున్నారు మేకర్స్. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన సూపర్ హిట్ గా మూవీల్లో కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ ఒకటి. చాలా కాలం తర్వాత నాగ్ కు హిట్ ఇచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకొని అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. అంతేగాక నా సామిరంగ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.

కింగ్ నాగార్జున కొంత కాలంగా ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే చాలా కాలం తర్వాత మాస్ హీరోగా ప్రేక్షకులను అలరించారు. సినిమాలో నాగ్ డైలాగ్స్, ఫైట్స్ ఒక్కేత్తయితే..హీరోయిన్ ఆశికా రంగనాథ్ యాక్టిగ్, అందాలకు క్రురాళ్లు ఫిదా అయ్యారు. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ మలయాళీ రీమేక్.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. నా సామిరంగకు కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలో నా సామిరంగ ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన విడుదల చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. అయితే ఎప్పటి నుంచి అన్న విషయాన్ని మాత్రం ఇంకా తెలపలేదు. అయితే ఫిబ్రవరి 12 లేదా 15 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ మూవీని ఓటీటీ ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.

Updated : 9 Feb 2024 7:17 AM IST
Tags:    
Next Story
Share it
Top