Home > సినిమా > నా సామిరంగా టీజర్ బలే ఉందే

నా సామిరంగా టీజర్ బలే ఉందే

నా సామిరంగా టీజర్ బలే ఉందే
X

అక్కినేని నాగార్జున కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. తన తరం హీరోలంతా ఇప్పుడు ఫామ్ లో ఉన్నారు. తను తప్ప. ఓ సాలిడ్ హిట్ కోసం చకోర పక్షిలా చూస్తున్నాడు. ఈ క్రమంలో అతని కెరీర్ లో ఇప్పుడు వందవ సినిమాకు చేరువయ్యాడు. 99వ చిత్రంగా నా సామిరంగా చేస్తున్నాడు. మళయాలంలో హిట్ అయిన మరింజు పొరియం జోష్ అనే చిత్రానికి రీమేక్ ఇది. కానీ తెలుగుకు అనుగుణంగా చాలా మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. ఈ చిత్రంతో విజయ్ బిన్న అనే కొరియోగ్రాఫర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. నాగ్ కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చినప్పుడల్లా మంచి విజయాలే అందుకున్నాడు. ఈ మూవీ టైటిల్ తో పాటు విడుదల చేసిన గ్లింప్స్, రీసెంట్ గా వచ్చిన పాట, అంజిగాడు పాత్రగా అల్లరి నరేష్ ను పరిచయం చేసిన గ్లింప్స్ అన్నీ ఆకట్టుకున్నాయి. ఇక లేటెస్ట్ గా నా సామిరంగా టీజర్ విడుదల చేశారు.

టీజర్ చూస్తే అవుట్ అండ్ అవుట్ విలేజ్ మాస్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. ఒకప్పుడు నాగ్ చేసిన ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అల్లరి అల్లుడు, హలో బ్రదర్ తరహాలో మాస్ తో పాటు క్లాస్ ను కూడా మెప్పించేలా కనిపిస్తోంది. హీరోయిన్ నాగార్జున ఫ్రెండ్స్ కు మందు పోయించి అతని గురించి ఆరాలు తీయడంతో మొదలైన టీజర్.. ఊర్లోని జాతరలో నాగ్ ఊచకోత కోస్తున్నట్టుగా ఉన్న ఫైట్ తో ఎండ్ అవుతుంది. టీజర్ కంప్లీట్ ఎంటర్టైనర్ లా ఉంది. ఈ మధ్య కాలంలో నాగార్జున ఇలాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ మాస్ స్టోరీస్చేయలేదు. ఇంకా చెబితే దశాబ్దాలు అవుతోంది. ఎలా చూసినా నా సామిరంగా టీజర్ చూసిన తర్వాత మూవీకి మోస్ట్ ప్రామిసింగ్ అనే కలరింగ్ వచ్చేసింది. ట్రైలర్ కూడా ఈ రేంజ్ లో ఉంటే ఖచ్చితంగా అంచనాలు పెరుగుతాయి. బిజినెస్ లెక్కలూ మారతాయి. సంక్రాంతి బరిలో నిలుస్తుందని టీజర్ లో చెప్పలేదు. ఒక వేళ సంక్రాంతికే విడుదలైతే మాత్రం ఖచ్చితంగా ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ లానే కనిపిస్తోంది.

Updated : 17 Dec 2023 4:14 PM IST
Tags:    
Next Story
Share it
Top