Naa Samiranga Movie : ఓటీటీలోకి నా సామిరంగ...స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X
కింగ్ నాగార్జున నటించిన లెటెస్ట్ మూవీ నా సామిరంగ ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలబడి ఘన విజయాన్ని సాధించింది. దీంతో చాలా రోజుల తర్వాత నాగ్ హిట్టు కొట్టాడు. ఈ మూవీలో నాగార్జున యాక్టింగ్, యాస ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించారు. అంతేగాక, హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో ఆడియన్స్ ను మెప్పించేందుకు వచ్చేసింది. ఇవాల్టి నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. నాగార్జునకి సంక్రాంతి సెంటిమెంట్ ఉండడంతో..ఈ సినిమాను తప్పకుండా బరిలోకి దింపాలని పట్టుదలతో ఆయన ఈ సినిమాను 3 నెలల్లో పూర్తి చేశారు. అనుకున్నట్టుగానే ఆయన సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి సక్సెస్ ను సాధించారు.
కాగా, ఈ మూవీలో డిఫరెంట్ మాస్ లుక్ తో నాగార్జున కనిపించారు. హీరోయిన్ యాక్టింగ్ కు కూడా మంచి మార్కులే పడ్డాయి. అయితే ఎప్పటిలానే అల్లరి నరేశ్...తమ్ముడి క్యారెక్టర్ కి న్యాయం చేసి ఎమోషనల్ సీన్స్ లో అదరగొట్టాడు. మొత్తానికి ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఫ్యామీలితో కలిసి ఎంచక్కా చూసేయండి..మరి.