Home > సినిమా > Thandel Movie Teaser : ‘తండేల్’ టీజర్ లాంటి వీడియో.. 2 నిమిషాల్లో కథేంటో చెప్పేశారుగా!

Thandel Movie Teaser : ‘తండేల్’ టీజర్ లాంటి వీడియో.. 2 నిమిషాల్లో కథేంటో చెప్పేశారుగా!

Thandel Movie Teaser  : ‘తండేల్’ టీజర్ లాంటి వీడియో.. 2 నిమిషాల్లో కథేంటో చెప్పేశారుగా!
X

చందూ మొండేటి డైరెక్షన్ లో.. నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా తండేల్. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా.. తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్ర బృదం. ఎసెన్స్ ఆఫ్ తండేల్ గా ఈ వీడియోను విడుదల చేశారు. సినిమాలో నాగచైతన్య పాత్ర ఎలా ఉంటుందో ఈ గ్లింప్స్ ద్వారా తెలియజేశారు. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతుంది ఈ సినిమా. గతంలో శ్రీకాకులం జిల్లాకు చెందిన కొందరు జాలర్లు.. పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి పట్టుబడ్డారు.

దాంతో వాళ్లను కొన్నేళ్లపాటు పాకిస్తాన్ జైల్లోనే నిర్భంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత చాలాకాలం తర్వాత స్వదేశానికి తిరిగొస్తారు. ఇప్పుడు అదే కథను మాధ్యమంగా చేసుకుని తండేల్ కథను రూపొందించారు. జాలరి పాత్రల నాగచైతన్య ఒదిగిపోయాడు. గ్లింప్స్ స్టార్టింగ్ లో ‘దదా.. గుర్తెట్టుకో.. ఈపాలి యాట గురి తప్పేదెలేదేస్’ అంటూ శ్రీకాకులం యాసను దింపేశాడు. పాక్ జైల్లో అధికారుల వల్ల పడ్డ తిప్పలు, అక్కడి అధికారులకు కౌంటర్ ఇవ్వడం లాంటి సీన్స్ చూపించారు. కథేంటో గ్లింప్స్ లో అర్థం అవుతుంది. ఏదేమైనా చైతూ పాన్ ఇండియా లెవల్ లో గట్టిగానే ప్లాన్ చేశాడు.






Updated : 6 Jan 2024 1:08 PM IST
Tags:    
Next Story
Share it
Top