Home > సినిమా > 'తండేల్' షూట్‌లో క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్

'తండేల్' షూట్‌లో క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్

తండేల్ షూట్‌లో క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్
X

'తండేల్' మూవీ షూటింగ్ ఫోటోస్ సడెన్‌గా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అక్కినేని నాగచైతన్యతో లేడీ సూపర్ స్టార్ సాయిపల్లవి 'తండేల్' చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ చందూ మొండేటి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పాకిస్తాన్‌లో చిక్కుకున్న ఇండియా జాలర్ల స్టోరీతో ఈ మూవీని తీస్తున్నారు. ఇందులో చైతన్య ఓ ఫిషర్ మెన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ అయ్యి సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. శరవేగంగా సాగుతున్న ఈ మూవీ షూటింగ్ నుంచి కొన్ని ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 'తండేల్' మూవీ షూటింగ్ నుంచి వర్కింగ్ స్టిల్స్‌ను మేకర్సే స్వయంగా రిలీజ్ చేశారు.

నాగచైతన్య, సాయి పల్లవి, డైరెక్టర్ చందూ మొండేటి, నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసులు తీయబోయే సీన్స్ గురించి డీప్‌గా మాట్లాడుకుంటున్నారు. ఓ ఫోటోలో సాయిపల్లవి సీరియస్‌గా రాసుకుంటోంది. మరో ఫోటోలో సాయిపల్లవి తన ఒడిలో ఓ చిన్నారిని కూర్చోబెట్టుకుని ఉంది. ఇదంతా చూస్తుంటే రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్‌లో షూట్ జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఈ మూవీ కోసం హైదరాబాద్‌లో స్పెషల్‌గా పాకిస్తాన్ సెట్ వేసి షూట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. చైతూతో లవ్ స్టోరీ మూవీ తర్వాత సాయిపల్లవి 'తండేల్' చేస్తోంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ కాంబో తర్వాత 'విరూపాక్ష' డైరెక్టర్ కార్తీక్ దండుతో సాయిపల్లవి ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వైరల్ అవుతున్న ఫోటోస్ చూసి ఆమె అభిమానులు క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Updated : 22 March 2024 1:16 PM GMT
Tags:    
Next Story
Share it
Top