Sai Pallavi: రూమర్స్ నిజమయ్యాయి.. చై, సాయి పల్లవి జోడీ కుదిరింది
X
లవ్ స్టోరీ సినిమాతో హిట్ కొట్టి ద్వారా ఆన్ స్క్రీన్ జంటగా క్లిక్ అయ్యారు నాగ చైతన్య, సాయి పల్లవి. ఈ ఇద్దరు కలిసి మరో సినిమాలో నటిస్తున్నారని గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. డైరెక్టర్ చందూ మొండేటి.. వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడు. దానికి హీరోగా నాగ చైతన్యను ఫిక్స్ చేశాడు. ఈ సినిమాలో సాయి పల్లివి నటిస్తుందని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ సినిమా డైరెక్టర్, నిర్మాత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా నడుస్తున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. #NC23 (నాగ చైతన్య 23వ సినిమా)అనేది వర్కింగ్ టైటిల్ గా ఫిక్స్ చేశారు. ప్రేమమ్, సవ్యసాచి సినిమాల తర్వాతత చైతూ-చందూ కాంబోలో వస్తున్న సినిమా ఇది.
సినిమా కథేంటి..?
సినిమా స్టోరీ నిజ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంది. శ్రీకాకుళం, విజయనగరంకు చెందిన 24 మంది మత్స్యకారులు 2018 నవంబర్ లో గుజరాత్ రాష్ట్రంలోని వీర్ వల్ వద్ద సముద్రంలో చేపలు పట్టుకుంటుంటారు. ఆ సమయంలో పొరపాటున సరిహద్దులు దాటి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ లకు బందీలుగా చిక్కి, ఏడాదిన్నరపాటు పాక్ లో జైలు శిక్ష అనుభవిస్తారు. ఈ క్రమంలో పెళ్లైనా కొన్ని రోజులకే బందీ అవడం, జైలులో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్న తన భార్య ప్రసవించడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ల గురించి ఏ విషయం తెలియని స్థితి.. వాళ్ల కష్టం కళ్లకు అద్ద పట్టే కొన్ని సన్నివేశాలు ఆధారంగా చేసుకుని.. ఓ ప్రేమ కథను రూపొందించాడు చందూ. ఆ స్టోరీతో సినిమా కథను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను బన్ని వాసు నిర్మిస్తుండగా.. పాన్ ఇండియా లెవల్ లో విడుదల కానుంది.