Home > సినిమా > Nagababu : మెగా కోడలు ఉపాసనను అభినందిస్తూ నాగబాబు ట్వీట్

Nagababu : మెగా కోడలు ఉపాసనను అభినందిస్తూ నాగబాబు ట్వీట్

Nagababu  : మెగా కోడలు ఉపాసనను అభినందిస్తూ నాగబాబు ట్వీట్
X

మెగా కోడలు ఉపాసనను అభినందిస్తూ సినీ నిర్మాత నాగబాబు ట్వీట్ చేశారు. అపోలో వైద్య సంస్థల ద్వారా ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నందుకు ఉపాసనను అభినందించారు.అపోలో వైద్య సంస్థల వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి నిజమైన లెజెండ్ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ప్రతాప్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. లెజెండ్స్ వారంతట వారే ఆవిర్భవించాలి తప్ప తయారు చేయడం సాధ్యం కాదని నాగబాబు పేర్కోన్నారు. అలాంటి లెజెండ్స్ లలో ప్రతాప్ రెడ్డి ఒకరని, ఆయన సేవా కార్యక్రమాలకు తాను అభిమానినని చెప్పుకొచ్చారు. ఇక, తాతగారి బాటలోనే నడుస్తూ ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతోందంటూ మెగా ఇంటి కోడలు కొణిదెల ఉపాసనను నాగబాబు మెచ్చుకున్నారు. ఈ ట్వీట్ చూసిన ఉపాసన.. థాంక్యూ అంకుల్ అంటూ జవాబిచ్చింది. టాలీవుడ్ స్టార్ కపుల్స్ రామ్ చరణ్, ఉపాసనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరి లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది క్లీం కార. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది.




Updated : 6 Feb 2024 1:53 PM IST
Tags:    
Next Story
Share it
Top