Bigg Boss 7 Telugu : విడాకులయ్యాక.. మొదటిసారి మాజీ కోడలి గురించి నాగార్జున ఆరా
X
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదలయింది. బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆదరించే ఈ షో.. ఆదివారం (సెప్టెంబర్ 3) నుంచి ప్రసారం కాబోతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ హౌజ్ లోకి అడుగుపెట్టారు. ఇంకా కొంతమంది వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని సీజన్స్ ను తలదన్నేలా ఈ సీజన్ ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు చెప్పిన బిగ్ బాగ్.. ఈసారి ఉల్టా పల్టా అని ట్యాగ్ లైన్ జోడించుకున్నారు. దీంతో హైప్ మరింత పెరిగింది. కాగా కర్టెన్ రైజర్స్ ఈవెంట్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పై విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి సందడి చేశారు. డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాగార్జునతో కలిసి స్టేజ్ ను పంచుకుని.. వాళ్ల సినిమా ప్రమోషన్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో నాగార్జున వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురిచేశాయి.
విజయ్ తో మాట్లాడిన నాగార్జున.. ఏంటి ఖుషిగా ఉన్నావ్ అని అడిగాడు. దానికి విజయ్ ‘చాలా రోజుల తర్వాత నా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో చూసినవాళ్లంతా ఖుషి అయి.. బయటికి వస్తున్నారు. దాంతో నేను కూడా ఖుషిగా ఉన్నా’అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ‘నువ్వొచ్చావ్ సరే.. సమంత ఎక్కడ’ అని నాగ్ అడగగానే అంతా షాక్ తిన్నారు. ‘సమంత అమెరికాలో ఉంది. ఖుషి ప్రమోషన్స్ చేస్తూ.. ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అందుకే ఇక్కడికి రాలేదంటూ’ విజయ్ చెప్పుకొచ్చాడు. దీంతో నాగార్జున ప్రొఫెషనలిజం బయటపడింది. ఫ్యామిలీ మ్యాటర్ ఎలా ఉన్నా.. ఏం జరిగినా ఫ్రొఫెషనల్ గా అంతా కలిసే ఉంటామని నిరూపించాడు. ఇప్పటికే చాలాసార్లు తనకు సమంత అంటే చాలా ఇష్టమని నాగార్జున చెప్పాడు.