Home > సినిమా > Biggboss 7: రైతు బిడ్డే అందరి టార్గెట్.. చివరికి నాగార్జున ఏం చేశాడంటే?

Biggboss 7: రైతు బిడ్డే అందరి టార్గెట్.. చివరికి నాగార్జున ఏం చేశాడంటే?

Biggboss 7: రైతు బిడ్డే అందరి టార్గెట్.. చివరికి నాగార్జున ఏం చేశాడంటే?
X

రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ సత్తా చాటుతున్నాడు. హౌస్ లో ఎవరు పట్టించుకోకపోయినా.. అందరు టార్గెట్ చేసి వేదించినా ఓపికగా ఆడుతున్నాడు. అవమానాలను తట్టుకుని నిలబడుతున్నాడు. ప్రతీ టాస్క్ లో గొప్పగా ఆడుతూ ఎవరికీ తక్కువ కానని నిరూపించుకున్నాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. బిగ్ బాస్ సీజన్ 7 తొలి కెప్టెన్ గా నియమితుడయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ రంగు పడుద్ది టాస్క్ ను నిర్వహించాడు. అందులో సందీప్, గౌతమ్,ప్రశాంత్,తేజ పాల్గొన్నారు. సంచాలక్ గా ప్రియాంక్ ను నియమించారు. గేమ్ లో ఓ సర్కిల్ ఉంటుంది. అందులో నలుగురు నిలబడి ఒకరికొరకు రంగులు పూసుకోవాలి. గేమ్ అయిపోయే వరకు ఎవరి టీ షర్ట్ కు తక్కువ రంగులు ఉంటే వాళ్లు విజేత. ఈ టాస్క్ లో చివరికి పల్లవి ప్రశాంత్ గెలిచి.. కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

దానిపై హౌస్ మేట్స్ లో కొంత అసంతృప్తి ఉంది. టాస్క్ లో కూడా ప్రశాంత్ కు సపోర్ట్ ఇవ్వకుండా వేరే ప్లేయర్స్ కు సపోర్ట్ చేశారు. అయితే తాజా ప్రోమోలో నాగార్జున టాస్క్, గేమ్ గురించి హౌస్ మేట్స్ తో చర్చించాడు. తప్పు చేసిన వాళ్లను, తప్పుగా మాట్లాడిన వాళ్లపై ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో టేస్టీ తేజ, యావర్ లను నాగార్జున తెగ మెచ్చుకున్నాడు. మాటిచ్చినట్లే తేజ హూస్ లో ఎంటర్టైన్ చేస్తున్నాడని.. యావర్, తేజ జోడీని చూస్తుంటే ముచ్చటేస్తుందని చెప్పుకొచ్చాడు. ఫ్రూట్ నింజా టాస్క్ లో అమర్ దీప్, సందీప్ మాస్టర్ చేసిన ఓవర్ యాక్షన్ పై నాగార్జున మండిపడ్డాడు. అమర్ దీప్ అందరితో ‘బొక్కలాగ’ అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పాడు. సంచాలక్ కాకపోయినా అమర్ దీప్ సంచాలక్ గా, ఓ లీడర్ లా వ్యవహరించడం తప్పని నిలదీశాడు. మిగతా కంటెస్టెంట్స్ టాస్క్ లో పాల్గోన్న విధానంపై కూడా నాగార్జున మాట్లాడాడు. ఆ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. శనివారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ చూడాలి.

Updated : 7 Oct 2023 12:37 PM IST
Tags:    
Next Story
Share it
Top