Daggubati Heroes : నాంపల్లి కోర్టు సీరియస్..దగ్గుబాటి హీరోలపై కేసు
X
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, రానాకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేష్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు, దగ్గుబాటి రానాపై వెంటనే కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలను పాటించకుండా కూల్చివేతలకు పాల్పడ్డారని నాంపల్లి కోర్టు సీరియస్ అయ్యింది. క్రిమినల్ కోర్టులో నందకుమార్ పిటీషన్ మేరకు కోర్టు వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని తెలిపింది.
కోట్ల విలువైన బిల్డింగ్‌ను ధ్వంసం చేసి ఫర్నీచర్ ఎత్తుకెళ్లారని నందకుమార్ పిటీషన్‌లో తెలియజేశారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు ముగ్గురిపై కేసు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 448, 452, 380, 506, 120బి కింద కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి రానా, దగ్గుబాటి అభిరామ్‌లపై కేసు నమోదు చేయనున్నారు.
ఈమధ్యనే హీరో వెంకటేష్ నటించిన సైంధవ్ విడుదలైంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ వెంకటేష్ కెరీర్‌లో 75వ చిత్ంర కావడం విశేషం. ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మించారు. సైంధవ్ మూవీ జనవరి 13వ తేదిన తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. ఈ సమయంలోనే వెంకటేష్‌పై కేసు నమోదు కావడం చిత్ర పరిశ్రమలో చర్చకు దారితీసింది.