ఎంట్రీ ఇవ్వబోతున్న యువసింహం.. !! నెటిజన్ల కామెంట్లు
X
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం.. అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు దీనిపై చర్చ జరిగింది. అయితే గతేడాది జరిగిన గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో తనయుడు ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేశారు బాలయ్య. వచ్చే ఏడాది(2023లో) మోక్షజ్ఞను టాలీవుడ్ కు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే తనయుడి ఎంట్రీ ఉంటుందా అన్న ప్రశ్నకు.. అంతా దైవ నిర్ణయం అంటూ నవ్వుతూ బదులిచ్చారు.
ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా మోక్షజ్ఞకు సంబంధించిన లుక్స్, ఫొటోస్ సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ మధ్యలో మోక్షజ్ఞ కాస్త స్లిమ్‌గా మారడం, మొన్న నందమూరి సుహాసిని కొడుకు పెళ్లిలో ఎన్టీఆర్‌తో కలిసి సందడి చేయడం.. అలా ఆ ఫొటోస్ అన్నీ బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి నెట్టింట్లో మోక్షజ్ఞ హాట్‌టాపిక్‌గా మారారు. తాజాగా ఆయన బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సెట్స్‌ను సందర్శించారు. దర్శకుడు అనిల్‌రావిపూడి, శ్రీలీల, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి ముచ్చటిస్తూ కనిపించారు.
ఈ పిక్స్‌లో మోక్షజ్ఞ గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు మోక్షజ్ఞ లుక్ మెస్మరైజింగ్‌గా ఉంది, ఓ యంగ్ హీరోకు ఉండాల్సిన లక్షణాలు అన్ని నందమూరి నటవారసుడులో కనిపిస్తున్నాయి, సింహం యాటకొచ్చే సమయం వచ్చినట్టుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
He's coming 🔥💥
— Rakhi_NBK_Official 🔰 (@RakhiNbk) August 28, 2023
Nata simham ❌
Yuva simham ✅🦁🤙 #Mokshagna #BhagavanthKesari#NandamuriBalakrishna #Balayya pic.twitter.com/BtWRv1IpKi