నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు చానా ఏండ్లు యాదుంటది..
X
నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది. బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా సినిమా అఫీషియల్ టీజర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలయ్య కాంబినేషన్లో వస్తున్న ఈ భగవంత్ కేసరి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అఫీషియల్ టీజర్ వాటిని ఇంకాస్త పెంచాయి.
మాస్ యాక్షన్ జోనర్లో సాగే భగవంత్ కేసరిలో బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లో కేక పుట్టిస్తున్నారు. రాజు ఆయన ఎనకాల ఉన్న వందల మంది మందను చూయిస్తడు. మొండోడు ఆనికున్న ఒకే ఒక గుండె చూయిస్తడు. ఇక కానో కీ బీచ్ మే బేజా క్యూ రహతా హై.. జబ్ హాత్ కాన్ బైరీపై పడ్తీ హై.. జబ్ బాత్ బేజేమే గుస్తి హై.. అంటూ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా యేళ్లు యాదుంటది. అంటూ బాలయ్య తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. తమన్ మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేసిండు. ఫ్యాన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్న టీజర్ చూసిన వారంతా బాలయ్య ఖాతాలో మరో హిట్ ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ.. NBKను తలపించేలా నేలకొండ భగవంత్ కేసరి పేరు ఉండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మిస్తున్న భగవంత్ కేసరిలో బాలకృష్ణకు జోడీగా కాజల్ కనిపించనుంది. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. కథ అంతా కూడా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
నేలకొండ భగవంత్ కేసరి🔥
— Shine Screens (@Shine_Screens) June 10, 2023
ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది 😎#NandamuriBalakrishna in & as #BhagavanthKesari
TEASER OUT NOW ❤️🔥
- https://t.co/MakPOy07uo#HappyBirthdayNBK@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/DhG2KSmQ0F