Unstoppable : వయసు 63 ఏళ్లు..అయినా డ్యాన్స్‌తో దుమ్ములేపుతున్న స్టార్ హీరో
X
బిగ్ స్క్రీన్లోనే కాదు బుల్లితెర మీద దుమ్ముదులపాలంటే బాలయ్య తరువాతే ఎవరైనా. సినిమాల్లో నటుడిగా తన టాలెంట్‌తో పిచ్చెక్కించే బాలయ్య ఓటీటీలోనూ అన్‌స్టాపబుల్ వంటి స్పెషల్ షోతో ఇరగదీశాడు. ఈ షో మరే షో సాధించలేని విధంగా సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసిందంటే దానికి బాలకృష్ణే కారణం అని చెప్పక తప్పదు. తనదైన స్టైలిష్ లుక్స్‌తో మాటల గారడీతో మ్యాజిక్ చేశాడు బాలయ్య. స్టార్ హీరోల పర్సనల్ లైఫ్‌ను స్మాల్ స్క్రీన్‌పై చూపించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. అన్ స్టాపబుల్ షో సీజన్ 1 ఏ రేంజ్లో హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. తాజాగా బాలయ్య సీజన్ 2కి ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా విడుదలైన ఓ ప్రోమో వీడియో ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రోమోలో మాత్రం బాలయ్య తన విశ్వరూపాన్ని చూపించాడు. 63 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా యువ నటితో కలిసి స్టేజ్ మీద చిందులేశాడు. ఆ డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
నందమూరి బాలకృష్ణ ఎనర్జీ ఏపాటిదో అందరికీ తెలుసు. మనిషి కాస్త బొద్దుగా ఉన్నా ఎన్నో కష్టతరమైన స్టెప్పులను సైతం ఎంతో సింపుల్‌గా చేసేస్తారు. అయితే ఇన్నాళ్లు ఓ ఎత్తు ఇప్పుడు మరోఎత్తు. బాలయ్య 63 ఏళ్ల వయసులోనూ ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. ఆయన ఫుల్
ఎనర్జీతో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో బాలయ్య సూట్ వేసుకుని నందమూరి నాయక పాటకు నటి పూర్ణతో కలిసి సూపర్బ్ డ్యాన్స్ చేశారు. తన మాస్ పెర్ఫార్మెన్స్తో అందరినీ అలరించాడు. నెట్టింట్లో బాలయ్య డ్యాన్స్ చూసిన వారంతా జై బాలయ్యా , స్టెప్పులు అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ తగ్గేదేలే అంటున్నారు బాలయ్య. ఇదంతా అన్‌స్టాపబుల్ 2 ఓటీటీకి ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.
టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి మూవీని చేస్తున్నారు. ఫుల్ లెన్త్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19న వెండితెరమీద సందడి చేయనుంది. ముద్దుగుమ్మలు కాజల్ అగర్వాల్, శ్రీలీల ఈ మూవీలో కీ రోల్స్ పోషిస్తున్నారు. దీంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
Balayya planning to do a New Show on OTT 🥁🔥🕺
— ѕαι ¢нαιтαηуα (@Chaitanya9045) August 16, 2023
Once #BhagavanthKesari shoot completed, will get more details on this. Stay tuned 🔥🔥#NandamuriBalakrishna pic.twitter.com/nzcJccR5c7