NBK 109 First Glimpse : అగ్ని లావా మధ్య బాలయ్య.. శివరాత్రికి అదిరిపోయే గిఫ్ట్
X
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో వరుసగా వంద కోట్ల వసూళ్లను రాబట్టారు. తాజాగా బాలయ్య 109వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సౌజన్య ఈ మూవీని రూపొందిస్తున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా నేడు బాలయ్య కొత్త మూవీ నుంచి గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. గ్లింప్స్ ప్రారంభంలోనే అగ్నిలావాలా పొంగుతున్నట్లు చూపిస్తూ బాలయ్య ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత బాలయ్య చెప్పే డైలాగ్స్ పూనకాలు తెప్పిస్తాయి. విలన్ ఏంట్రా..వార్ డిక్లేర్ చేస్తున్నావా?, సింహం నక్కలా మీదకు వస్తే వార్ అవ్వదురా లఫుట్..దానిని హంటింగ్ అంటారు..అని బాలయ్య చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్ అదిరిపోయాయి. గ్లింప్స్‌లోనే ఇంతలా అదరగొట్టిన బాలయ్య మూవీ మొత్తంలో ఇంకెలా ఉంటాడోనని బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
గ్లింప్స్‌లో బాలయ్య సరికొత్త లుక్‌లో మరింత యంగ్‌గా కనిపిస్తున్నాడు. ఈ మూవీ 1980వ దశకం స్టోరీ అని తెలుస్తోంది. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వయోలెన్స్‌కి విజిటింగ్ కార్డు.. ప్రపంచానికి ఇతను తెలుసు, కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికీ తెలీదు అనే కొటేషన్స్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచాయి. మొత్తానికి బాలయ్య హంటింగ్ బిగెన్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలయ్య మూవీ గ్లింప్స్ వీడియో వైరల్ అవుతోంది.