Home > సినిమా > NANI30: నాని 30 అప్డేట్ వచ్చేసింది.. టైటిల్ ఇదే

NANI30: నాని 30 అప్డేట్ వచ్చేసింది.. టైటిల్ ఇదే

NANI30: నాని 30 అప్డేట్ వచ్చేసింది.. టైటిల్ ఇదే
X

దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ పనిలో బిజీగా ఉన్నాడు. ‘నాని 30’ అనే వర్కింగ్ టైటిల్‌తో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నాడు. శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ మూవీ ఈ ఏడాది చివరికల్లా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. నాని కేరీర్ లో వస్తున్న ఈ 30 వ సినిమాకు హాయ్‌ నాన్న అనే టైటిల్‌ ను అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. ఇటీవల నాని ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ని ఇచ్చాడు. ఆకాశంలో పారాగ్లైడింగ్ (Paragliding) చేస్తూ ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ ని నేడు జులై 13న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నాని 30వ సినిమాకి ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ ని ప్రకటించారు. అలాగే చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌ వీడియోలో.. నాన్న గురించి కొన్ని ఎమోషన్‌ సీన్స్‌ ఉన్నాయి. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో నాని, మృణాల్ ఠాకూర్, నానికి కూతురుగా కనిపించే పాపని చూపించారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఒక ఎమోషనల్ స్టోరీ అని, సినిమాలో నాని భార్య చనిపోవడంతో పాపతో జీవిస్తూ ఉంటే మృణాల్ తన లైఫ్ లోకి పాప ద్వారా వస్తుంది అని అర్ధమవుతుంది. గతంలో జెర్సీ సినిమాలో నాన్న ఎమోషన్ తో ఆల్రెడీ నాని మెప్పించి ప్రేక్షకులని ఏడిపించాడు. ఇప్పుడు మళ్ళీ హాయ్ నాన్న అంటూ మరోసారి మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

Updated : 13 July 2023 1:21 PM IST
Tags:    
Next Story
Share it
Top