Home > సినిమా > Nani : నాని చేతిలో అరడజను సినిమాలు..భారీ బడ్జెట్ మూవీస్ ప్లాన్

Nani : నాని చేతిలో అరడజను సినిమాలు..భారీ బడ్జెట్ మూవీస్ ప్లాన్

Nani : నాని చేతిలో అరడజను సినిమాలు..భారీ బడ్జెట్ మూవీస్ ప్లాన్
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని అంటే ఎంతో క్రేజ్ ఉంది. మొదటల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ కెరీర్‌ను నాని మొదలుపెట్టారు. ఆ తర్వాత సెకండ్ హీరోగా మారి వరుస సక్సెస్‌లు అందుకున్నాడు. నేడు హీరో స్థాయి నుంచి రూ.100 కోట్ల కలెక్షన్స్ తెచ్చే స్థాయికి నాని ఎదిగారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో హీరో నానికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.

ఇకపోతే ఫిబ్రవరి 24న నాని తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఆ రోజు తన సినిమాల అప్డేట్స్ ఇచ్చారు. టాలీవుడ్‌లో నాని సినిమాల లైనప్ అదిరిపోయానని, చేతినిండా సినిమాలతో నాని బిజీగా ఉంటున్నారని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇకపోతే నాని కూడా తన సినిమాల కథల్లో వేరియేషన్స్ చూపిస్తూ వస్తున్నాడు. ఈ మధ్యనే దసరా లాంటి ఫుల్ మాస్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లను వసూలు చేసింది. ఆ తర్వాత హాయ్ నాన్న అనే ఎమోషనల్ క్లాసిక్ మూవీతో విజయం సాధించాడు.

నాని తన తర్వాతి సినిమాను డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేస్తున్నాడు. 'సరిపోదా శనివారం' అనే సినిమాను మాస్ కమర్షియల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 29వ తేదిన విడుదల కానుంది. ఇకపోతే బలగం సినిమా డైరెక్టర్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా నాని ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతోంది. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో నాని మరో సినిమా ప్రకటించాడు. ఈ నాలుగు సినిమాలతో పాటుగా త్రివిక్రమ్ కూడా నానితో ఓ మూవీ అనుకున్నాడట. అలాగే ఓ తమిళ్ డైరెక్టర్‌తో నాని సినిమా ఉంటుందట. ఈ సినిమాలన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వైవిధ్యమైన కథనాలతో తెరకెక్కనున్నాయి. మొత్తానికి నాని చేతినిండా సినిమాలు ఉండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 27 Feb 2024 5:08 PM IST
Tags:    
Next Story
Share it
Top