Home > సినిమా > వర్మ వ్యూహానికి చిక్కులు.. హైకోర్టులో లోకేష్ పిటిషన్

వర్మ వ్యూహానికి చిక్కులు.. హైకోర్టులో లోకేష్ పిటిషన్

వర్మ వ్యూహానికి చిక్కులు.. హైకోర్టులో లోకేష్ పిటిషన్
X

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మూవీపై మొదటి నుంచి టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అటు సెన్సార్ బోర్డు సైతం సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే వర్మ పోరాడంతో ఎట్టకేలకు సెన్సార్ కంప్లీట్ అయ్యింది. ఈ క్రమంలో డిసెంబర్ 29న సినిమాను విడుదల చేస్తున్నట్లు వర్మి ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాపై నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వ్యూహం సినిమా విడుదల కాకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో నారా లోకేష్ కోరారు. సినిమాలో చంద్రబాబును తప్పుగా చూపించారని.. ట్రైలర్లో చూపించిన విధంగానే సినిమా మొత్తం ఉండే అవకాశం ఉందని అన్నారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఎంతో నిబద్ధత, పారదర్శకతతో ఉన్నారని.. కానీ ఈ సినిమాతో ఆయన్ని అపఖ్యాతి చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కు లబ్ది చేకూర్చేలా వర్మ వ్యవహరిస్తున్నారని అన్నారు. వీరి చర్యల వల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు పార్టీ గౌరవం దెబ్బతింటుందని వాపోయారు. అయితే ఈ పిటిషన్ ఈ నెల 26న విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది.

Updated : 22 Dec 2023 4:04 PM GMT
Tags:    
Next Story
Share it
Top